అధిక లోడుతో ప్రయాణం వద్దు.. : ఎస్సై వెంకటసుబ్బయ్య
1 min readపల్లెవెలుగు వెబ్:రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ పరిమితి మించి వాహనాలలో ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్నారు గడివేముల ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య. గురువారం మండలంలోని ఆటో డ్రైవర్లకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, వాహనాల రికార్డులు ఖచ్చితంగా ఉండాలని సూచించారు. ఆటో ఓవర్ లోడుకు పాల్పడితే చర్యలు తప్పబోవన్నారు. ఆటో నడుపుతూ మొబైల్ ఫోనులో మాట్లాడితే సహించేది లేదన్నారు. ఆటో పాయింట్లు, బస్టాఫుల వద్ద ఆటోలు రాంగ్ పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి ఆటోలు నడిపి తమ ప్రాణాలతో పాటు, ప్రయాణీకుల ప్రాణాలకు భద్రత లేకుండా చేయొద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు, రవాణా, పోలీస్ శాఖ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వారిపై చట్టరీత్యా తగు చర్యలు తప్పవని సూచించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు .పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.