మహిళలకు మోనోపాజ్ దశలో కాల్షియం అవసరమా ?
1 min readపల్లెవెలుగువెబ్ : మెనోపాజ్ తర్వాత మహిళల గుండె, ఎముకల ఆరోగ్యంలో ఎంతో మార్పు వస్తుందని ఇండస్ హెల్త్ ప్లస్ హాస్పిటల్ జాయింట్ ఎండీ డాక్టర్ అమోల్ నైకవాడి పేర్కొన్నారు. మెనోజాజ్ తర్వాత ఆస్టియోపోరోసిస్ బారిన పడతారని చెప్పారు. ఎముకలు బలహీన పడతాయని తెలిపారు. ఎముకలు పెద్ద ఎత్తున బలాన్ని కోల్పోవడంగా పేర్కొన్నారు. పైకి దీని లక్షణాలు కనిపించకుండానే ఈ నష్టం జరిగిపోతుంది. కనుక ఈ రిస్క్ తగ్గించుకునేందుకు డాక్టర్ అమోల్ సూచనలు ఇలా ఉన్నాయి.
క్యాల్షియం తీసుకోవాలి
క్యాల్షియం తగినంత శరీరానికి అందేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఈ క్యాల్షియంతో ఎముకలు బలంగా ఉంటాయి. పాల ఉత్పత్తులు, సాల్మన్ చేపలు, పాలకూర, బ్రొక్కోలీతో క్యాల్షియం తగినంత అందుతుంది. క్యాల్షియం గ్రహించేందుకు మెగ్నీషియం కూడా అవసరం. కనుక రోజుకో అరటి పండు తినొచ్చు.