మద్యం తాగితేనే ‘అమ్మ ఒడి’ ఇస్తారా ?
1 min readపల్లెవెలుగు వెబ్ : రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్బంగా శాసనమండలిలో ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ నాన్న తాగడం ద్వారే అమ్మ ఒడి డబ్బులు వచ్చాయని చెబుతారా ?. మద్యం తాగితేనే అమ్మ ఒడి ఇస్తారా ?. ఎక్కువ సంక్షేమం ఉన్నందున ఎక్కువ తాగాలంటారా ? ` అంటూ శాసనమండలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యం ఆదాయంతోనే అమ్మ ఒడి ఇస్తామంటే బడులకు వెళ్లినప్పుడు ఎలా ఉంటుందని అన్నారు. తాగిన దాంట్లో నుంచే అమ్మఒడి డబ్బులు వచ్చాయంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలతో పాటు.. వైద్య బిల్లుల చెల్లింపును దీని ఆదాయంతో చేపట్టండని అన్నారు. తాగితాగి లివర్ చెడిపోతుందని, అందుకే వైద్య బిల్లులు ఇందులో పెట్టామని చెప్పండంటూ విమర్శించారు. ధరలను పెంచడం ద్వార దశల వారీగా మద్యం నియంత్రిస్తామని చెప్పారని, తాగేవారి సంఖ్య తగ్గిందా.. వారి ఖర్చు తగ్గిందా అని ఆయన ప్రశ్నించారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఉపసంహరించుకుంటుందని చెప్పారు.