దేశంలో పేదరికం ఎంత ఉందో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : భారత దేశంలో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిందని ప్రపంచ బ్యాంకు పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్ వెల్లడించింది. 2011లో 22.5 శాతం మంది పేదరికంలో ఉండేవారని, 2019 నాటికి ఇది 10.2 శాతానికి తగ్గిందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం బాగా తగ్గినట్లు పేర్కొంది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా ఇదే విధంగా చెప్పిన సంగతి తెలిసిందే. భారత దేశం తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించిందని ఐఎంఎఫ్ వర్కింగ్ పేపర్ వెల్లడించింది. ప్రభుత్వం ఉచితంగా ఆహార సరుకులను అందజేస్తుండటంతో వినియోగంలో అసమానతలు 40 ఏళ్ళలో కనిష్ట స్థాయికి తగ్గిపోయినట్లు తెలిపింది.