PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అయ్యా అంటూ వ‌స్తామ‌నుకున్నారా .. అది ఎప్ప‌టికీ జ‌ర‌గ‌దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ నాయ‌కులు అజ్ఞానంతో మాట్లాడుతున్నార‌ని నాగబాబు అన్నారు. ఇటీవ‌ల చిరంజీవి బృందం సీఎం జ‌గ‌న్ ను క‌ల‌వ‌డం పై ఆయ‌న స్పందించారు. చిరంజీవిగారు కొంతమంది హీరోలతో వెళ్లి జగన్ గారితో మాట్లాడారు. మరి జీవో ఇవ్వడానికి ఇంత లేట్ ఏమిటి? జీవో ఇవ్వకుండా పాత జీవో నే పెట్టడం వల్ల అయ్యా.. అంటూ పవన్ కల్యాణ్, మేమందరం వస్తామనుకున్నారా... మేం రాము. మా సినిమా వాళ్ల ఆర్థిక మూలాలను కొట్టేసి జీవితాలను తారుమారు చేసేద్దామని అనుకుంటున్నారేమో. అది ఎప్పటికీ జరుగదు. సినిమా హీరోలు శారీరకంగా ఎన్నో దెబ్బలు తింటూవుంటారు. ఆ దెబ్బలు కనుక మీరు... అంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.. అని చెపుతున్న వాళ్ళు తింటే కనీసం ఒక సంవత్సరం ఐసియు లో వుంటారు. హీరోలు ఎంతో కష్టపడుతూ సినిమా హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనే భయంతో బ్రతుకుతూ వుంటారు. తెలుగు హీరోల రెమ్యునరేషన్ తక్కువ, తమిళ్ బాలీవుడ్ హాలీవుడ్ లలో సినిమా సింహ భాగం రెమ్యునరేషన్ హీరోలే తీసుకుంటారు అని అన్నారు.

                                 

About Author