PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్ స్టాప‌బుల్కి బాల‌కృష్ణ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ పై నంద‌మూరి బాల‌య్య సంద‌డి చేయ‌బోతున్నారు. అన్ స్టాప‌బుల్ పేరుతో టాక్ షో త్వర‌లో ప్రారంభ‌మ‌వుతోంది. ఇటీవ‌లే ఈ షోను బాల‌య్య లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ టాక్ షో కోసం బాల‌య్య భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నట్టు స‌మాచారం. సుమారు ఒక్కో షోకు 40 ల‌క్షల రూపాయ‌ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటున్నట్టు స‌మాచారం. మొత్తం 12 షోల‌కు 5 నుంచి 6 కోట్లకు వ‌ర‌కు పారితోషికం తీసుకుంటున్నార‌ని ఇండ‌స్ట్రీ టాక్. ఈ షో ఎంతవ‌ర‌కు ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకుంటుందో చూడాలి. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ కి దాదాపు 15 ల‌క్షల మంది స‌బ్ స్క్రైబ‌ర్స్ ఉన్నారు.

About Author