PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రక్తదానం చేయండి -ప్రాణదాతలు కండి : సీఐ సుబ్బరాయుడు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె : పోలీస్ స్టేషన్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు అమర వీరలైన పోలీసులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్.. ఈ పదమే గంభీరం తెగువకు త్యాగానికి పర్యాయం ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మాత్రం మేల్కొని, కాపలా కాస్తుంటారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఎందరో ప్రాణ త్యాగాలు చేయగా వారిని స్మరించు కునే రోజు వచ్చింది. కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించి అనంతరం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది.అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు,సబ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి, శంకర్ నాయక్ లు మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు. ప్రతి ఏడాది ఈ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం ను దేశం మొత్తం జరుగుతుందన్నారు. 1959లో అక్టోబర్ 21న చైనా సైనికులను ఎదిరించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన పోలీసు వారి ధైర్యాని, త్యాగాన్ని అమరవీరుల స్మారకదినంగా మనదేశం గత 62 ఏళ్లుగా గుర్తు చేసు కుంటుందన్నారు. పలుకుతుందన్నారు. అలాగే రక్తదానం అనేది చాలా ముఖ్యమైనది రక్తదానం చేయడంవల్ల ఆరోగ్యవంతులుగా మరియు ఇతరులకు చాలా మందికి ఉపయోగపడుతుందని గర్భిణి స్త్రీలకు గానీ, రక్తహీనతతో ఉన్న, యాక్సిడెంట్ అయిన మరియు అత్యవసరంలలో రక్తదానం అనేది చాలా గొప్ప కార్యక్రమమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి షాషావలి, గడ్డం ఇద్రుస్ బాషా, షేక్షావలి, నాగేష్, మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author