NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాయుధ దళాల ఫ్లాగ్ డే నిధికి విరాళాలు అంద చేయండి

1 min read

తనవంతుగా 10,000 రూపాయల విరాళ

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : దేశ రక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న  సాయుధ దళాల కుటుంబాల సంక్షేమం కోసం  ఫ్లాగ్ డే నిధికి  విరివిగా విరాళాలు అందచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పిజిఆర్ఎస్ లో  అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ఫండుకు తనవంతుగా 10,000 రూపాయలు విరాళం ప్రకటించారు . ప్రతి ఉద్యోగి , అధికారులు కూడా  తమ వంతు గా ఆర్ధికము గా సహకారం అందించాలని, దేశం కోసం సైనికులు చేస్తున్న త్యాగాలకు  కృతజ్ఞతగా  ఫ్లాగ్ ఫండ్ కు విరాళాలు అందచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ  కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ  చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు అనురాధ , కొండయ్య , సైనిక సంక్షేమ అధికారి రత్న రూత్,  తదితరులు పాల్గొన్నారు.

About Author