NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆకట్టుకున్న విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్…

1 min read

మిడుతూరు మోడల్ పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్.

మిడుతూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో జరిగిన ఆహార పదార్థాల వారోత్సవాలు పాఠశాల ప్రిన్సిపాల్ బీటీ శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈవోలు ఫైజు న్నిసా బేగం,మల్లికార్జున నాయక్ హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులు ఎంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రకరకాలుగా తయారు చేసిన ఆహార పదార్థాలను వారే తయారు చేసి తయారు చేయుట గురించి విద్యార్థులు క్లుప్తంగా వివరించారు.వీటిలో ఎన్నో వినూత్న వంటకాలు మరియు పోషక విలువలు గల వంటకాలతో అందరినీ ఆకర్షించాయి.విద్యార్థులు చాలా చక్కగా తయారు చేయడంతో ఎంఈవోలు విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ టీచర్ రెహమున్నిసా మరియు ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

About Author