NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పశువులను సంత మార్కెట్లో కొనవద్దు

1 min read

– పాక్ వైరస్ నుంచి చర్మవ్యాధి: పశువైద్యాధికారి
పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు: పశువులను సంత మార్కెట్లలో కొనవద్దని మిడుతూరు పశువైద్యాధికారి సాయినాథ రెడ్డి అన్నారు.మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో 95 పశువులకు లంపి స్కిన్(చర్మ వ్యాధి)టీకాలను వేసినట్లు పశు వైద్యాధికారి తెలిపారు.ఈసందర్భంగా ఆయన రైతులకు తెలియజేస్తూ ఈచర్మ వ్యాధి అనేది పాక్ వైరస్ నుంచి వస్తుందని ఈచర్మ వ్యాధి రావడం వల్ల చర్మం అంతా దద్దుర్లు ఉంటాయి.జ్వరం అధికంగా 104 డిగ్రీలు ఉంటుంది కాళ్ళు మెడ గంగడోలు వాపు ఉంటుంది.ముఖ్యంగా తెల్లజాతి ఆవులకు,ఎద్దులకు ఎక్కువగా ఈవ్యాధి అనేది వస్తుంది.సంవత్సరం లోపు ఉన్న దూడలకు వస్తే దూడలకు ప్రమాదకరంగా ఉంటుందన్నారు. పశువులకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అని రైతులు గమనిస్తూ ఉండాలని ఒకవేళ పశువులకు ఈలక్షణాలు ఉన్నట్లయితే వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలని పశువైద్యాధికారి సాయినాథ రెడ్డి తెలిపారు.ఈకార్యక్రమంలో వైసీపీ నాయకులు తిమ్మారెడ్డి,అటెండర్ తిరుపతయ్య మరియు రైతులు పాల్గొన్నారు.

About Author