ఆటిజం ఉన్న పిల్లల్ని అవహేళన చేయకండి
1 min readఅంతర్జాతీయ ఆటిజం దినోత్సవం ఏప్రిల్ 2న
టి. మేఘవతి
PGDSE in Multiple Disabilities,
Spl Educator,
KIMS Hospital, Kurnool.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మీ పిల్లలు మిమల్ని అమ్మా అని పిలవడం లేదా!, మీ చిట్టి తల్లి మీ కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం లేదా!, మీ బుజ్జి పిల్ల ఒంటరిగా ఉండానికి ఇష్టపడుతుందా! తల్లిదండ్రులరా తస్మాత్ జాగ్రత్త:పిల్లలు కళ్లల్లో కళ్లు పెట్టి చూడలేక పోవటం, తమ తోటి పిల్లలతో కలిసి ఆడుకోలేక పోవటం, మనుషులతో ఉండటం కంటే ఎక్కువ సమయం ఆట వస్తువులతో గడపడం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, ప్రవర్తనలో విపరీత ధోరణి కనబడటం, తమలో తాము మాట్లాడుకోవడం, తమ భావాలను వ్యక్త పరచలేక పోవడం, ఒకచోట స్థిమితంగా కూర్చోలేక పోవడం, ఏకాగ్రత తక్కువగా ఉండటం., ఎక్కువగా గుండ్రంగా తిరిగే వస్తువులను చూడటం మరియు ఆడటం, తమ నీడతో తాము ఆడుకోవడం, ఎలాంటి అనుభూతిని కూడా తెలుపలేక పోవడం, శబ్దాలను పట్టించుకోక పోవడం, పిలిచినా పలుకక పోవడం, చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేస్తూ ఉండటం, సరిగా మాట్లాడలేక పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా!ఈ లక్షణాలు కనబడితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై తగిన చికిత్స తీసుకుంటే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. లేదంటే మిన్ను విరిగి మీద పడి, మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది జాగ్రత్త!!ఇవి ఆటిజం లక్షణాలు. ఆటిజం అనేది పిల్లల్లో వచ్చే ఒక న్యూరోలాజికల్ డెవలప్మెంట్ డిజార్డర్. ఇది జబ్బు కాదు. ఇది ఒక స్థితి (Condition), దీనివల్ల పిల్లల్లో సోషల్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ మరియు ప్రవర్తనా సమస్యలు, వయస్సుకు తగిన మానసిక పరిపక్వత లేకపోవడం, సెన్సరీకి సంబంధించిన సమస్యలు ఉండటం వలన ఇది పిల్లల ఎదుగుదలకు మానసికంగా చాలా ఇబ్బందులు పెడుతుంది.మారుతున్న కాలంతోపాటు కరోనా మహమ్మారి వచ్చినప్పుడు, ప్రపంచమంతా లాక్డౌన్లో ఉన్నప్పుడు పిల్లలు, పెద్దలు నాలుగు గోడల మధ్య బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండిన తరువాత ఆటిజం సమస్య పిల్లల్లో ఎక్కువగా పెరుగుతుండటం చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం.ఆటిజం అనేది ఒక పెద్ద సమస్య, దీనిని నివారించడంలోనే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా అటిజం లక్షణాలు మూడేళ్ల వయస్సు నిండకముందే కలిపిస్తాయి. ఇది లింగ భేదంతో సంబంధం లేకుండా వచ్చే సమస్య. ఈ సమస్య కలిగిన వారు తరుచుగా మూర్చవ్యాధి, హైపరాక్టీవ్ డిజార్డర్ వంటి రుగ్మతలను సైతం కలిగి ఉంటారు.- ఆటిజం రావడానికి కారణాలు: పిల్లల మెదడు ఎదుగుదలలో లోపాలు, జన్యుపరమైన లోపాలు, గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్ల బారినపడటం, తీవ్రమైన ఉద్వేగాలకు లోనవడం, నెలలు నిండకుండా శిశువు జన్మించడం, పౌష్టికాహార లోపం, ఇవే కాకుండా పరిస్థితులు, పరిసరాల ప్రభావం, తల్లిదండ్రులు నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడపలేక పోవడం, రోజులో ఎక్కువ సమయం మొబైల్స్, టీవీలు చూడటం, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై పోవడం, పిల్లలకు ఆటలు ఆడే సమయం లేకపోవడం, ఆహారపు అలవాట్లల్లో మార్పులు, పాతకాలం నాటి ఆటలు కనుమరుగై పోవడం, పాతకాలం నాటి అలవాట్లు, పద్ధుతులను వదిలి అధునికతవైపు పరుగులు తీయడం, విపరీతంగా మొబైల్స్, టీవీలు చూడటం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD)లో చాలా రకాలు ఉన్నాయి.1) అటిస్టిక్ డిజార్డర్: అటిస్టిక్ డిజార్డర్ ఎక్కువగా కనిపించే సమస్య ఆటిజంను ఎక్కువగా మగ పిల్లల్లో గమనించ వచ్చును.2) రెట్స్ డిజార్డర్: ఇది అజంలో అరుదైన రకం. ఈ సమస్య ఆడ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.3) చైల్డ్ హుడ్ డిసెంటిగ్రేటెడ్ డిజార్డర్: ఇది ఆటిజంలో తీవ్రమైన సమస్య4) యాస్పర్జర్స్ డిజార్డర్: ఈ పిల్లల్లో తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు ప్రత్యేకమైన పనుల్లో మంచి నైపుణ్యంను ప్రదర్శిస్తారు.5) వర్చువల్ ఆటిజం: ఇది అతిగా మొబైల్, టీవీ స్క్రీస్ చూడటం వలన వచ్చే సమస్య, వీరికి హైపరాక్టీవ్, రెస్ట్ లెస్ గా ఉండటం, సోషల్ విజ్ఞాన్ అవ్వడం, బిహేవియర్ సమస్యలు మరియు ఎదుగుదల సమస్యలు ఉంటాయి. కాని ఇది న్యూరోలాజికల్ డెవలప్ మెంటల్ డిజార్డర్ కాదు.6. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ను రివర్స్ చేయడానికి ఏ విధమైన చికిత్స అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్న అన్ని చికిత్స పద్ధతుల యొక్క ముఖ్య లక్ష్యం బలహీనతలను తగ్గించి, వారి సామర్థ్యములను పెంచడమే.ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో పిల్లవాడు విభిన్నంగా ఉండటమే కాకుండా ప్రత్యేక అవసరాలు కలిగి ఉంటాడు. ఆటిజం స్పెక్ట్రం యొక్క సమస్యలు తగ్గించడానికి బిహేవియర్ థెరపి (ABA), కాగ్నిటీవ్ థెరపి, జాయింట్ అటెన్షన్ థెరపి, అక్యుపేషనల్ థెరపి, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపి, ఫిజికల్.