భధ్రత పేరుతో హిందూ పండుగల నిర్వహణ ఆపొద్దు
1 min read– విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆనవాయితీగా కర్నూలు జిల్లా లోని హోళగుంద మండల కేంద్రంలో ప్రతి సం.ఆనవాయితీగా జరిగే ” హనుమజ్జయంతి ” పండుగను నిర్వహించుకోవడానికి పోలీసు శాఖ తగిన ” రక్షణ ” కల్పించి హిందువుల పండుగైన “హనుమజ్జయంతి” ని తగిన నియమ – నిబంధనలతో… ఎట్టి పరిస్థితుల్లో జరిగేలా చూడాలని కోరుతూ ఈరోజు 31/3/23,న ఉ. 11:30 కు కలెక్టర్ కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ గౌ. రామసుందర్ రెడ్డి గారికి వినతి పత్రం అందించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ… భధ్రత పేరుతో హిందువుల పండుగలను జరకుండా ఆపడాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నదని గతంలో జరిగిన విషయాల ను ‘బూచి’ గా చూపి హిందువుల ఆరాధ్య దైవమైన ఆంజనేయుని జన్మదినం సందర్భంగా నిర్వహించే ” హనుమజ్జయంతి ” జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మతాల మధ్య గొడవలకు,శాంతి భధ్రతలు విఘాతం కలుగ డానికి “హిందూ పండుగలు” కారణమని చూపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనీ అది హేయమైన చర్య అనీ దీనిని బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తున్నదనీ, హిందూ పండుగలను ఆపాలని చూస్తే… దీని కోసం బజరంగ్ దళ్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తుందని హెఛ్ఛరించారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి యస్.ప్రాణేష్, కోశాధికారి సందడి మహేష్,సహకోషాధికారి గూడా సుబ్రహ్మణ్యం,జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ లు పాల్గొన్నారు.