ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి
1 min read
ఆర్పిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘన నివాళులు…….
కర్నూలు, న్యూస్ నేడు: బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్భంగా ఆర్పిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు పోస్టల్ కాలనీ నందు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆర్పిఎస్ఎఫ్ టౌన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. లక్ష్మీ ప్రశాంత్,టౌన్ సెక్రటరీ డి. దివాకర్ మాట్లాడుతూబాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు,భారత తొలి ఉప ప్రధాని,సమసమాజ స్థాపనకు కృషి చేసిన కృషీవలుడు అని వారు కొనియాడారు, రాజ్యాంగం అమలు కోసం చట్ట సభల్లో పోరాటం చేశారని,బడుగు బలహీవర్గాలకు అభివృద్ధి కోసం రాజ్యాంగంలో కల్పించిన హక్కుల అమలుకోసం కృషి చేశారని,కుల రహిత సమాజం కోసం అహర్నిశలు పోరాటం కొనసాగించారని బాబు జగ్జీవన్ రామ్గారు సామజిక, సంఘసంస్కర్త అని వారు కొనియాడారు.అట్టడుగు వర్గాల అభ్యున్నతి ,అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మన భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ని ఆదర్శంగా ప్రతి విద్యార్ధి, యువత, రాజకీయనాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఆశయ సాధనకు కృషి చెయ్యాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఎస్ఎఫ్ టౌన్ నాయకులు రోహిత్, చిన్న, సునీల్, నిరంజన్, జయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.