NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తిరుపతి ఎంపీ గెలుపు.. దేశానికి ఓ మెసేజ్​ కావాలి..

1 min read

– సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, తిరుపతి : తిరుపతి పార్లమెంట్​ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డా. గురుమూర్తి గెలుపు… దేశానికి ఓ మెసేజ్​ కావాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక పార్టీ శ్రేణులతో సమీక్ష జరిపారు. సంక్షేమం.. అభివృద్ధిని విస్తృతంగా ప్రజల దగ్గరకు వెళ్లి వివరించాలని, సమన్వయంతో పని చేసి తిరుపతి లోకసభ అభ్యర్థి డా. గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదేశించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలి. తిరుపతిలో వచ్చిన మెజార్టీ ఒక మెసేజ్‌గా ఉండాలి. మహిళా సాధికారత, మహిళలకు జరిగిన మేలును కూడా తెలపాలి. నియోజకవర్గానికి ఒక మంత్రి ఇన్​చార్జ్​గా, ఎమ్మెల్యే అదనంగా ఉంటారని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్​ జగన్​ వెల్లడించారు.

About Author