NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పశ్చిమ ప్రకాశం ప్రాణదాత డాక్టర్ మన్నె రవీంద్ర

1 min read

– డాక్టర్ మన్నే రవీంద్ర నర్సింగ్ హోమ్ నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవనికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు
పల్లెవెలుగు వెబ్ యర్రగొండపాలెం : యర్రగొండపాలెం నియోజకవర్గంలోని డాక్టర్ మన్నే రవీంద్ర నర్సింగ్ హోమ్ నూతన బిల్డింగును నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు.నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….. పశ్చిమ ప్రకాశంలో తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ డాక్టర్ మన్నే రవీంద్ర ప్రజల ప్రశంసలు పొందుతూ..పేదల డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారని చంద్రబాబు డాక్టర్ మన్నే రవీంద్రను అభినందించారు.ఆపరేషన్ల స్పెషలిస్ట్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేసే ఆపద్బాంధవుడిగా ప్రజలు చెప్పుకుంటున్నారని తెలిపారు.రవీంద్ర రాజకీయాన్ని వైద్యాన్ని రెండు కళ్ళుగా జీవితాన్ని గడుపుతున్నారని యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి అహర్నిశను కృషి చేస్తున్నారని ప్రశంసించారు.2024 ఎన్నికల్లో యర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి విజయంలో రవీంద్ర కీలక భూమికి పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం డా౹౹చదలవాడ మాట్లాడుతూ……రాజకీయాలకు అతీతంగా ప్రజలకు తక్కువ ఖర్చుకు వైద్యం చేస్తూ పశ్చిమ ప్రాంత ప్రాణదాతగా డాక్టర్ మన్నె రవీంద్ర పేరు తెచ్చుకున్నారన్నారు.యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ప్రతి ఇంటిలో పార్టీలకు అతీతంగా డాక్టర్ మన్నే రవీంద్ర అభిమానులు ఉన్నారని ఆయన వైద్య సహాయం అందని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదన్నారు.యర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి డాక్టర్ మన్నె రవీంద్ర చేసిన కృషి మరువలేనిదని డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author