PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూకంపం.. 1000 మంది మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అఫ్ఘాన్‌ తూర్పులోని ఖోస్ట్‌ ప్రావిన్స్‌ పరిధిలోని పాక్‌ సరిహద్దులో ఉన్న పర్వత ప్రాంతం పక్టికా కేంద్రంగా భూమి కంపించడంతో.. మట్టి ఇళ్లు పెళపెళా కూలిపోయాయి. పర్వత ప్రాంతం కావడంతో.. బండరాళ్లు దొర్లిపడ్డాయి. బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనలో.. వందల మంది నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండడంతో తీవ్రత ఎక్కువగా ఉందని ఐరోపా భూకంపాల అధ్యయన సంస్థ వెల్లడించింది. ‘‘ఇప్పటి వరకు 1,000 మందికి పైగా చనిపోయి ఉంటారని అంచనా. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చు. 1,500 మంది వరకు క్షతగాత్రులున్నారు.ఖోస్ట్‌ ప్రావిన్స్‌లోనూ చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. పక్కా గృహాలు ఉండే చోటే ఇలా ఉంటే.. మారుమూల, పర్వత ప్రాంతాల్లో మట్టిగోడలతో నిర్మించిన ఇళ్ల పరిస్థితి మరింత దారుణం’’ అని అధికారులు వివరించారు.

                                      

About Author