PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్థిక వ్యవ‌స్థకు వ్యవ‌`సాయ‌మే` ఊతం !

1 min read

పల్లెవెలుగు వెబ్: క‌రోన మ‌హమ్మారి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవ‌స్థ కుదేలైంది. ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని యావ‌త్ దేశం చ‌విచూసింది. అన్ని రంగాల్లో వృద్ధి నిలిచిపోయింది. దేశ ఆర్థిక చ‌క్రమే క‌ద‌ల‌కుండా ఉండిపోయింది. వ్యాక్సినేష‌న్ తో ఆర్థిక వ్యవ‌స్థ నెమ్మదిగా కోలుకోవ‌డం మొద‌లుపెట్టింది. ఈ స‌మ‌యంలో దేశ ఆర్థిక వ్యవ‌స్థ తొంద‌ర‌గా కోలుకోవ‌డంలో వ్యవ‌సాయ రంగం ఎంతో ఊత‌మిచ్చింది. ` వ్యవ‌సాయం భార‌త దేశానికి పునాది. ఈ రంగం ఇచ్చిన ఊతం వ‌ల్లే 2021-22 ఆర్థిక పున‌రుత్థానం వేగం పుంజుకుంద‌ని ` ఆర్థిక శాఖ నెల‌వారీ ఆర్థిక విశ్లేష‌ణ నివేదికలో పేర్కొంది. తొలి రెండు త్రైమాసికాల్లో వ్యవ‌సాయం 4.5 శాతం వృద్ధి న‌మోదు చేసింది. ర‌బీలో నూనె గింజల సాగు క్రితం కంటే 29 శాతం పెరిగింది. ట్రాక్టర్ అమ్మకాలు గ‌త ఏడాది కంటే 7 శాతం పెరిగాయి. 2021-22లో ఖ‌రీఫ్, ర‌బీకి మ‌ద్దతు ధ‌ర వృద్ధి చెందింద‌ని ఆర్థిక శాఖ నివేదిక‌లో పేర్కొంది.

About Author