మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం
1 min read
హోం మినిస్టర్ వంగలపూడి అనిత పై అనుచిత వ్యాఖ్యలు
కాకినాడలో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి ఆధ్వర్యంలో నిరసన
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: రాష్ట్రహోం మంత్రి వంగలపూడి అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలి అని ఎమ్మార్పీఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ జిల్లా ఇంచార్జ్ పసుపులేటి చిన్న బాబు మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పసుపులేటి చినబాబు మాదిగ మాట్లాడుతూ ఒక మహిళా మంత్రిపై నీచ పదజాలం తో మాట్లాడటం, సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలని, ఈ పదవిని పట్టుకొని ఊగులాడుతున్నావని అత్యంత హీనంగా, నీచమైన భావన వచ్చే విధంగా అంబటి రాంబాబు అవమానకరంగా మాట్లాడారని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు మాదిగ జాతికి, యావత్ మహిళా సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారురాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద అధికార పార్టీని నిలదీసే హక్కు ఉంటుంది. కాని ఒక మహిళా మంత్రిపై అహంకారపూరితంగా, అవమానకర వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమన్నారు.ఈ విషయంలో వెంటనే వైయస్సార్సీపి అధినేత వై ఎస్. జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకునే విధంగా, అలాగే బహిరంగ క్షమాపణ చెప్పించే విధంగా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి స్పందించకపోతే మాదిగ ప్రజలు, యావత్తూ మహిళా సమాజ ఆగ్రహానికి వైయస్ ఆర్ సి పి గురికాక తప్పదన్నారు.మీరు మాట్లాడే ఇలాంటి అహంకార పూరిత వ్యాఖ్యలు ఎక్కడైనా చెల్లుతాయామో గాని , మాదిగల దగ్గర మాత్రం చల్లవని హెచ్చరించారు. జిల్లా కో ఇన్చార్జ్ పలివెల నవీన్ మాదిగ రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి ఎంత పై వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని పక్షంలో మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమం లో జిల్లా కో ఇన్చార్జ్ వల్లూరి సత్తిబాబు మాదిగ,కాకినాడ జిల్లా కోఇంచార్జ్ అనంతవరపు రాజు మాదిగ,కాకినాడ జిల్లా కో ఇన్చార్జ్ పలివెల నవీన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ కాకినాడ.టౌన్ అధ్యక్షులుతుమ్మలపల్లి సంతోష్ కుమార్ మాదిగ, ఎన్ ఎస్ పి తుని నియోజకవర్గం ఇంచార్జ్ కింతాడ సత్తిబాబు మాదిగ,జగ్గంపేట నియోజకవర్గం కో ఇన్ఛార్జ్ మండే డేవిడ్రాజు మాదిగ, సామర్లకోట మండల అధ్యక్షులు మోర్త కృపారావు మాదిగ,కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు వేమగిరి రవి మాదిగ చీలి ప్రేమ్ కుమార్ మాదిగ తుని మండలం ఇంచార్జ్,పెద్దాపురం మండల ఎమ్మెస్ పి అధ్యక్షులు ఇప్పత్తి రవి మాదిగ,తుమ్మలపల్లి చిన్నబాబు మాదిగ, మిరియాల వీరబ్బాయి మాదిగ,కాకినాడ రూరల్ ఎం ఎస్ పి అధ్యక్షులు నాని మాదిగ,నడుకుర్తి రాజు మాదిగ, మోటుకూరి వరలక్ష్మి మాదిగ,తుని మండలం ఎం ఎస్ పి అధ్యక్షులు రాయి మోషే మాదిగ, కామరాజు మాదిగ,ఆరుగుల కర్నేలు మాదిగ,కొమ్ముకూరి నాగేశ్వరావు మాదిగ, ఉదయమాదిగ, ప్రసాద్ మాదిగ, ఉడత వీరబాబు మాదిగ, సురేష్ మాదిగ, సునీల్ మాదిగ, అశోక్ మాదిగతదితరులు పాల్గొన్నారు.


