NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తంగేళ్లమూడి బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి కృషి

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: తంగెళ్ళమూడి 49వ డివిజన్  ముట్లకోనేరు బరియల్ గ్రౌండ్ కి ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ నూతన కార్యవర్గం మంగళవారం 5o డివిజన్ సమాధుల తోట లో నిర్వహించారు,49వ డివిజన్ ముట్ల కోనేరులో గతంలో సుమారు నాలుగు ఎకరాలు స్థలాన్ని నగరపాలక సంస్థ వారు కేటాయించారు,నూతన స్థలం నిర్వహణ మరియు అభివృద్ధి కమిటీ సమావేశం మరియు నూతన కార్యవర్గ వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం సమావేశమయ్యారు, ఈ సందర్భంగా ఫాదర్ బాల మాట్లాడుతూ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కే స్థలాన్ని కేటాయించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కి నగర మేయర్ కి ప్రజా ప్రతినిధులకు,అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ప్రత్యేకమైన ఆధునిక టెక్నాలజీ, సుందరీకరణ తో రూపుదిద్దుకోవడం నిర్మాణాలు చేపట్టడం సంతోషదాయకం అన్నారు. గౌరవ అధ్యక్షులుగా కారుపాటి శాంతి సాగర్,అధ్యక్షులు  బిషప్ పమ్మీ శ్యామ్ పాల్, కార్యదర్శి రిటైర్డ్  బ్రేక్ ఇన్స్పెక్టర్ మార్ల పూడి పౌలు రాజు, కోశాధికారి బీరపోగు యోహాన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫాదర్ బాల, ఫాదర్ జార్జి,ఫాదర్ ఐ మైకేల్,  మరియు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్,బురదగుంట క్రాంతి వివిధ సంఘాల పెద్దలు కమిటీ సభ్యులు సమైక్యంగా పాల్గొన్నారు.

About Author