PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ లేక గ్రామీణా ప్రాంతాల నుండి నగరంలోకి వచ్చి వార్తలు సేకరించేందుకు అయ్యే ఖర్చులతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్థుత ప్రభుత్వం తీసుకువచ్చిన అక్రమ జీఓలు జర్నలిస్ట్ అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ మంజూరులో తీవ్ర అన్యాయం జరుగుతోంది. అలాగే చాలీచాలని వేతనాలతో రాత్రి, పగలు పనిచేస్తున్న ఇండ్లు, ఇండ్లస్థలాలు లేక అనేక సంవత్సరాల నుండి సొంత ఇల్లు  కోసం ఎదురు చూస్తున్నారు. పెరిగిన ధరలకు అద్దె ఇళ్ళలో నివసించడానికి అద్దెలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. జర్నలిస్టుల పిల్లలకు కార్పోరేట్, ప్రైవేట్, స్కూల్స్, కాలేజీలలో 100 శాతం ఫీజులు లేకుండా రాయితీ ఇప్పించడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తోంది. కావున తమ పార్టీ ఆద్వర్యంలో జర్నలిస్ట్ ల  సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి ద్వారా పోరాటం సాగించి తగు న్యాయం చేయగలరని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నందికొట్కూరు విలేఖరులు గురువారం నందికొట్కూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు  విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఉన్న ఈ డిమాండ్లను నెరవేర్చాలని వివరించారు. ఆర్ఎస్ఐ ప్రాతిపదికన అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ మంజూరు చేయాలి.అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలి.జర్నలిస్టుల పిల్లలకు కార్పోరేట్, ప్రైవేట్,స్కూల్, కాలేజీలలో 100 శాతం ఫీజులు లేకుండా రాయితీ కల్పించాలి.జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు ప్రత్యేక చట్టం అమలు చేయాలని కోరారు.అన్యాక్రాంతం అవుతున్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు రక్షణ కల్పించాలన్నారు. హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో నందికొట్కూరు పత్రికా సోదరులు పల్లెవెలుగు జయరాజు, తెలుగు ప్రభ గోపి ,ప్రజా శక్తి  స్వామన్న , పల్లెవాణి ఉమర్ ,తదితరులు పాల్గొన్నారు.

About Author