NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిల్లల సంరక్షణకు కృషి…

1 min read

జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఐసిడిఎస్ పిడి విజయ

కర్నూలు , న్యూస్​ నేడు:  జిల్లాలోని 18 సంవత్సరాలలోపు పిల్లల సంరక్షణకు కృషి చేస్తామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి, పి. విజయ తెలిపారు. కలెక్టర్ వారి కార్యాలయంలోని శనివారం జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ -1098 కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాలబాలికలకు రక్షణ మరియు సంరక్షించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ -1098 టోల్ ఫ్రీ నెంబర్, 24/7 గం,, లు ఉచితంగా పని చేస్తుందన్నారు. ఏ క్షణంలోనైనా ఎలాంటి ఆపద వచ్చిన వెంటనే 1098కి ఫోన్ చేస్తే ఆపదలో ఉన్నవారిని రక్షించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరుస్తామన్నారు. తరువాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయం మేరకు పిల్లలకు రక్షణ.. సంరక్షణ లేదా విద్యావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.అనంతరం డిసిపిఓ టి.శారద  మాట్లాడుతూ జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్-1098 కి సంబందించి ప్రభుత్వం రూపొందించిన నియమనిబంధనల మేరకు పని చేస్తామన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ నిర్వహణకు సంబందించి అవసరమైన సిబ్బందిని ప్రభుత్వం నియమించిందన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది సమిష్టిగా విధులు నిర్వర్తించి జిల్లాలో బాల, బాలికలకు రక్షణగా నిలుస్తామని తెలిపారు.అనంతరం జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్-1098  కోఆర్డినేటర్ డి. సుంకన్న మాట్లాడుతూ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, వీధి బాలలు, తప్పిపోయిన పిల్లలు, అనాథలు, వేధింపులకు గురైన పిల్లలు, ప్రమాదంలో ఉన్న పిల్లలు వంటి ప్రతి చిన్నారి సంక్షేమానికి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్ – 1098 నిరంతరం సేవలందిస్తోందని తెలిపారు. పిల్లలకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే 1098కు సమాచారం అందిస్తే సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకొని పిల్లలకు రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ హెల్ఫ్ లైన్ సిబ్బంది కౌన్సిలర్, సూపర్వైజర్లు, కేస్ వర్కర్లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *