NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అండ

1 min read

స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్రలో ఎమ్మెల్యే చింతమనేని

గురుకుల పాఠశాలలో ప్రత్యేక హ్యాండ్‌వాష్ థీమ్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను సాకారం చేసేలా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, వారి బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెదవేగి మండలం లక్ష్మీపురం గురుకుల పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక హ్యాండ్‌వాష్ థీమ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన అవసరం చిన్ననాటి నుంచే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సమాజ స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు.

మౌలిక వసతులపై ఆరా : ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న విద్యావిధానాలు, విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందితో ఎమ్మెల్యే ప్రత్యేకంగా చర్చించి వివరాలు తెలుసుకున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *