PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

1 min read

– అధ్యక్షుడు వి. సుదర్శన్, ప్రధాన కార్యదర్శి పి. వి. వి. వరప్రసాద్
పల్లెవెలుగు వెబ్ కల్లూరు అర్బన్ : ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్-ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల ఫెడరేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. యు పి ఎస్ ఎఫ్ గా గత నాలుగు సంవత్సరాలు గా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న ప్రైవేటు పాఠశాలల అభ్యున్నతికి కృషి చేస్తూ , ఇబ్బందికరంగా ఇచ్చిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలపై ప్రయివేట్ పాఠశాలలకు అండగా ఉంటూ అవిరల కృషి చేస్తున్న సంస్థ యొక్క రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం విజయవాడ, హోటల్ గోల్డెన్ వే లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానం మేరకు ఎన్నుకున్నారు. యు పి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వి. సుదర్శన్ (కర్నూల్ జిల్లా), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పి.వి.వి. వరప్రసాద్ ( DBR అంబేడ్కర్ కోనసీమ జిల్లా ), రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. ఉమా మహేశ్వర రావు (విశాఖపట్నం జిల్లా), రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎం. అంజాద్ అలీ బేగ్ (అన్నమయ్య జిల్లా), రాష్ట్ర ట్రెజరర్ వి. దీపక్ రెడ్డి (తిరుపతి జిల్లా), రాష్ట్ర సబ్ ట్రెజరర్ ఎస్. కనక రత్నం ( విశాఖపట్నం ) రాష్ట్ర కన్వీనర్ లక్ష్మీ గణేష్ (DBR అంబేడ్కర్ కోనసీమ జిల్లా), ఉత్తరాంధ్ర రీజియన్ – జాయింట్ సెక్రటరీ కె. తిరుపతి రావు, గోదావరి రీజియన్ – జాయింట్ సెక్రటరీ సి హెచ్. ప్రసాద్ (DBR అంబేడ్కర్ కోనసీమ జిల్లా), మధ్య ఆంధ్ర – జాయింట్ సెక్రటరీ జీ. శ్రీకాంత్ (పల్నాడు జిల్లా), రాష్ట్ర డైరెక్టర్లు కె. అవినాష్ (NTR జిల్లా), బి. లక్ష్మీ కనకదుర్గ ( ప్రకాశం జిల్లా ), ఎన్. శర్మ (తూ.గో. జిల్లా), షింటో ఇమ్మానుయేల్ (అన్నమయ్య జిల్లా), కె. కృష్ణ కిషోర్ (అనంతపురం జిల్లా) నియమితులయ్యారు. అదేవిధంగా నాలుగు రీజియన్లకు కొంత మంది నాయకులను, కొన్ని జిల్లాల కార్యవర్గాన్ని కూడా ఎన్నిక చేయడం జరిగింది అని, త్వరలో ప్రతీ రీజియన్, జిల్లా స్థాయి నియామకాలు పూర్తి చేసి ప్రకటిస్తామని తెలియజేసారు. చిన్న ప్రయివేటు పాఠశాలల సమస్యలు గురించి UPSF వ్యవస్థాపక అధ్యక్షుడి హోదాలో ఇప్పటికే మూడు సార్లు రాష్ట్ర పర్యటన చేసి ప్రతీ జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గంలో ప్రాతినిధ్యం వహించే విధంగా సభ్యులను సమకూర్చగలగడం తన బాధ్యత, భాగ్యం గా ప్రవీణ్ కంటి మహంతి అభివర్ణించారు. రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల సుదర్శన్ మాట్లాడుతూ UPSF ను ఎటువంటి పక్షపాతం, రాగద్వేషాలు లేని సమాఖ్యగా భవిష్యత్తులో చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల సంక్షేమం & అభివృద్ధికై మరింత పటిష్టమైన కార్యాచరణతో నూతన కార్యవర్గం కృషి చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలో మరికొన్ని పర్యటనలు చేసి, ఏ జిల్లాల్లో UPSF సభ్యత్వం బలహీనంగా వుందో ఆ జిల్లాలను బలపరచడం జరుగుతుంది అని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వి వి వరప్రసాద్ మాట్లాడుతూ UPSF ను ప్రభుత్వ గుర్తింపు పొందే స్థాయికి తీసుకువెళతామని, విద్యా విధానంలో కీలకమైన మార్పులు, చేర్పులు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమాఖ్యను విద్యా వ్యవస్థలో ప్రధాన వాటాదారుగా గుర్తించే స్థాయి పొందే విధంగా రానున్న రెండు సంవత్సరాలలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే అన్ని జిల్లా స్థాయి, రీజియన్ స్థాయి నాయకుల నియామకాలు పూర్తి చేసి, రాష్ట్ర నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో వున్న ప్రైవేటు పాఠశాలల్లో ఎటువంటి పాఠశాలలను బడ్జెట్ పాఠశాలలుగా గుర్తించాలి, వాటికున్న ప్రధానమైన సమస్యలను గుర్తించి, పరిష్కారాల గూర్చి చర్చించి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తామని UPSF రాష్ట్ర కన్వీనర్ లక్ష్మీ గణేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గం నా. క్రిష్టఫర్ జిల్లా అధ్యక్షులు, మీ. రంగనాథ్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, సి. కుమార్ జిల్లా జనరల్ సెక్రటరీ, A. శ్రీనివాసరావు జిల్లా ట్రెజరర్ తదితరులు పాల్గొన్నారు.

About Author