NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కురుబ, కురుమల నూతన కార్యవర్గం ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్​ విజయవాడ: విజయవాడ కురుబ, కురుమ కుల నూతన కార్యవర్గాన్ని ఎన్నిక జరిగిందని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లోబుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కురుబ ,కురుమ సంఘం అధ్యక్షులు, జబ్బల శ్రీనివాసులు తెలియజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 27 -2022 తేదీన తంబళ్లపల్లి నియోజకవర్గం కురుబలకోట మండలం కే ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జనరల్ బాడీ మీటింగ్ జరిగిందని ఈ జనరల్ బాడీ మీటింగ్ లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని 16 జిల్లాల్లో కురుబ, కురుమకులానికి సంబంధించిన వారు ఉన్నారని ఈ జనరల్ బాడీ మీటింగ్ సమావేశానికి ఆంధ్ర ,తెలంగాణ ,కర్ణాటక, తమిళనాడు ,మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కురుబ, కురుమ ,కుల ,ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొని, కార్యవర్గ ఏర్పాటు కు భాగస్వామ్యలుగా వ్యవహరించారని ,వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, కురుబ కురుమ సంఘం గౌరవ అధ్యక్షులు తట్టి అర్జున్ రావు మాట్లాడుతూ కురుబ కురుమ కులా లు ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారని వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించి రాష్ట్రంలో 18 ఎమ్మెల్సీలు ఉన్నాయని ఈ కులానికి ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వాలని అది అధ్యక్షులు జబ్బలశ్రీనివాసులకి ఇవ్వాలని కోరారు.ఈ కులానికి ఐదు ఎకరాలు 10 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author