సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులుగా పి చంద్రశేఖర్ ఎన్నిక
1 min readపల్లెవెలుగు, వెబ్ చెన్నూరు : భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు ఈనెల 4 5 తేదీలలో విజయవాడలో జరిగాయని విజయవాడలో జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశంలో కడప జిల్లాకు చెందిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమలాపురం ఏరియా కార్యదర్శి పి చంద్రశేఖర్ లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులుగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు ఆదివారంనాడు కమలాపురంలోని స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 1995 నుండి విద్యార్థి దశ నుండి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఏఐఎస్ఎఫ్ లో కీలకంగా పనిచేసి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా జిల్లా టెక్నికల్ కన్వీనర్ గా పనిచేస్తూ 1998లో సిపిఐ సభ్యత్వం స్వీకరించి 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడిగా ఏఐటీయూసీ కమలాపురం ఏరియా కార్యదర్శిగా దళిత కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి జిల్లాలో అనేక సమస్యల పోరాటంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిలదించి అనేక పోలీస్ అక్రమ కేసులలో అరెస్టులు జైలకు వెళ్లిన చరిత్ర ఉన్నదని అంతకుమించి కమలాపురం నియోజకవర్గం లోని వీరపునాయన పల్లె మండలం యు రాజుపాలెం గ్రామానికి చెందిన కమ్యూనిస్టు పార్టీ కుటుంబంలో జన్మించి 1949లో జరిగిన పోలీసు కాల్పుల్లో అమరుడైన కామ్రేడ్ వెంకటరామయ్య గారి వారసత్వంగా కమ్యూనిస్టు పార్టీలో నమ్మిన సిద్ధాంతాల కోసం నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసిన ఘనత ఉండదని ఒక ఉద్యమ పోరాట గ్రామంలో నుండి రాష్ట్ర సమితికి ఎన్నికైన మొట్టమొదటి కార్యకర్తగా చంద్రశేఖర్ ఎన్నిక పట్ల యువరాజుపాలెం గ్రామ ప్రజలతోపాటు కమలాపురం నియోజకవర్గ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాసంఘాల నాయకులు కార్మికులు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు ఆయన సేవలను గుర్తించి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులుగా ఎన్నుకున్నందుకు సిపిఐ రాష్ట్ర సమితికి ఆయన ఎన్నికకు సహకరించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు గుజ్జుల ఈశ్వరయ్య సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్రాలకు కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీ కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెట్టించిన ఉత్సాహంతో పనిచేసే ప్రజా సమస్యల పరిష్కారం వైపు పయనిస్తానని ఆయన అన్నారు.