అర్హతే… ఆధారం..
1 min read– జగన్న కాలనీలతో.. పేదల మోముల్లో చిరు నవ్వులు
– ఎమ్మెల్యే తోగురు ఆర్థర్
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: జగనన్న కాలనీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రికలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అభివర్ణించారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లో భాగంగా గురువారం మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపాలిటీలోని కొణిదెల ముచ్చుమర్రి రహదారి పక్కన జగనన్న కాలనీల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ మొల్ల మహబూబ్ రబ్బానీ, హౌసింగ్ ప్రత్యేక అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న కాలనీల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు ఆనందపడేలా నివాస గృహాలు ఉంటాయని తెలిపారు. మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటికీ రూ 1.80 లక్షల నిధులును వ్యయం చేయడం జరుగుతుందన్నారు. ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరు నిరంతర ప్రక్రియగా సాగుతోందన్నారు.
దామగట్లలో.. జేసీ మౌర్య…
మండలంలోని దామగట్ల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హౌసింగ్ నారపు రెడ్డి మౌర్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కో- ఆప్షన్ మెంబర్ గఫార్ , హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్ వేణు గోపాల్ , హౌసింగ్ డిఈ ప్రభాకర్ , మున్సిపల్ కౌన్సిలర్స్ చిన రాజు, మందాడి వాణి, చింత తులశమ్మ, దేశెట్టి సుమలత, ,రవూఫ్, కృష్ణ, నాయబ్,హమీద్ మియ్య, చాంద్ భాష, లాలు ప్రసాద్, అర్షపోగు ప్రశాంతి, సురేష్ , దామగట్ల సర్పంచ్ మాధవరం సుశీలమ్మ, ప్రాత కోట గ్రామ సర్పంచ్ జయమ్మ , పంచాయతీరాజ్ శాఖ ఎస్ ఈ. శ్రీ నరసింహులు , వైయస్సార్సీపి రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకు చెర్ల రఘురామయ్య , వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు రమాదేవి , వనజ, పగిడ్యాల మండల తహసీల్దార్ రాజశేఖర బాబు, మండల అభివృద్ధి అధికారి గౌరీ దేవి , వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.