ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన జిల్లా అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ
1 min read
ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు షేక్ మునవ్వర్ అహ్మద్ మస్తాస్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా సంబంధాల ప్రతినిధి ముహమ్మద్ జావిద్ అహ్మద్ పాషా
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జమ్ము-కాశ్మీర్ రాష్ట్రం పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన క్రూరమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ ఘటనలో 72 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం మరియు అనేకమంది గాయపడడం మానవ హక్కుల పైన, మతసామరస్యంపైన మరియు మానవ విలువల పైన గాఢమైన దాడిగా ఆయన ఖండించారు. ఈ సందర్భంలో మాట్లాడుతూ, అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ఎప్పుడూ శాంతి, ప్రేమ మరియు మానవత్వం కోసం పనిచేస్తుందని, ఉగ్రవాదానికి మరియు ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా ఒక నిరపరాధిని హత్యచేస్తే, అది మొత్తం మానవ జాతిని హత్య చేసినట్లేననీ ఇస్లాం బోధిస్తుందని తెలిపారు. అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ తరపున, వీర మరణం పొందిన సోదర కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ధైర్యంగా ఉండి, సహనం కోల్పోకుండా ఉండాలని ప్రార్ధించారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భారతదేశం అనేది వివిధ మతాలు, జాతులు కలసి జీవించే అందమైన దేశమని, కొన్ని దుర్మార్గపు శక్తులు ఐక్యతను ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రజలు మానవతా విలువలను పరిరక్షిస్తూ ముందుకు సాగాలని పిలుపునిస్తూ వారు ఈ దేశానికి మరియు ప్రజలకు శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి ప్రసాదించమని దేవుని ప్రార్థిస్తున్నామని అన్నారు.