నూతన దంపతులను ఆశీర్వదించిన ఏలూరు ఎంపీ
1 min readపల్లెవెలుగు వెబ్ చింతలపూడి : ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గo. మండలం ఈనాడు రిపోర్టర్ సొంగ సూరిబాబు వివాహ సందర్భంగా ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్ బాబు నూతన దంపతులను ఆశీర్వదించారు. నిరంతరం ప్రభుత్వానికి ప్రజలకు, అధికారులకు వారధిగా ఉంటూ జర్నలిస్టులు ఎంతో శ్రమిస్తూ ఉంటారని, నిబద్ధతతో వృత్తిపై దృష్టి సారించి సమాజంలో జరుగుతున్న వాస్తవ వార్తలను ప్రజలకు అధికారులు తెలియజేస్తూ ఉండటంలో పాటుపడతారని అన్నారు. జర్నలిస్టుకు అన్ని విధాల సహాయ సహకారాలకు తాను ఎప్పుడు ముందు ఉంటానని తెలిపారు. ఎంపీ తోపాటు ఎయంసి చైర్మన్ జగ్గవరపు జానాకిరెడ్డి,జడ్పీటీసి మోలుగుమాటీ నీరజసుధాకర్,రామరావు,రాంబబు,తథితరులు పాల్గొన్నారు.