పరిశ్రమల్లో ఉపాధి , ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
1 min read– రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ
– పాణ్యం నియోజకవర్గంలో జరుగుతున్న భూదోపిడీపై సీఐడీ విచారణ చేయాలి
– మార్చి 6వ తేదిన పాణ్యం నియోజకవర్గ కేంద్రంలో నిరుద్యోగుల ఆత్మగౌరవ నిరాహార దీక్ష
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం నియోజవర్గంలోని ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం, కల్లూరు మండలాల్లో ఏర్పాటైన నూతన పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ పాణ్యం నియోజవర్గం పాణ్యం మండల కేంద్రంలో నిరుద్యోగుల ఆత్మగౌరవ దీక్షను మార్చి 6వ తేదీన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ విద్యార్థి , యువజన సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు , రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయుడు తెలిపారు.ఈ సందర్భంగా నేతలు శ్రీరాములు, రాజునాయుడు మాట్లాడుతూ పాణ్యం నియోజవర్గంలో వేల ఎకరాల్లో సోలార్, సిలికాన్, ఎయిర్పోర్టు, స్టీల్ ప్లాంటు తదితర పరిశ్రమలు ఏర్పాటు అయినప్పటికీ స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని . పరిశ్రమల ఏర్పాటుకు స్థానిక రైతుల పొలాలు వేల ఎకరాలు తీసుకున్నారు గాని రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడం లేదని పాణ్యం నియోజవర్గంలో వేల ఎకరాలను దోపిడి చేసి అదే విధంగా దొంగ పట్టాలు దొంగ పట్టాదారు పాస్ బుక్స్ పుట్టించి ప్రభుత్వం నుంచి సొమ్మును లాక్కుంటున్నారన్నారు. అదే విధంగా నియోజవర్గంలో ప్రకృతి సంపద అయినటువంటి ఎర్ర మట్టి, నల్ల మట్టిని అక్రమంగా మైనింగ్ చేసి వందల కోట్లు వెనుకేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ys జగన్ మోహన్ రెడ్డి గారు స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ పాణ్యం నియోజవర్గంలో ఏ పరిశ్రమలో కూడా స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఓర్వకల్లు పాణ్యం గడివేముల మండలాల్లో జరిగిన భూ దోపిడి పైన సిఐడి విచారణ చేయాలని, పాణ్యం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని తదితర డిమాండ్లతో మార్చి 6వ తేదీన రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ మరియు ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నామని ఈ నిరాహార దీక్షకు నిరుద్యోగులు ప్రజలు రైతులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ వీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు బత్తిని ప్రతాప్, పాణ్యం డివిజన్ నాయకులు బాలకృష్ణ నాయక్,విజయ్ పాల్గొన్నారు.
దోపిడి, పాస్ బుక్స్, నియోజవర్గం