మంత్రముగ్ధుల్ని చేస్తున్న కర్నూల్ వాటర్ ఫాల్స్ !
1 min readపల్లెవెలుగువెబ్: కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలం. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలోని జలపాతా అందాలు ప్రకృతి ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. వర్ణించడానికి వీలుకానంతగా మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందన్నట్లుగా ఎత్తయిన కొండల నుండి జాలువారే పాలధార లాంటి జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఆళ్ళగడ్డ మండల కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఎగువన ఆహోబిలం ఉంది. ఇక్కడ వర్షాకాలంలో జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలివస్తున్నారు.