PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దివ్యాంగుల భూమి సర్వేను అడ్డుకున్న కబ్జా దారులు

1 min read

– సంవత్సరాల తరబడి పరిష్కరించలేని రెవెన్యూ అధికారులు
పల్లెవెలుగు వెబ్​ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లో లక్కిరెడ్డిపల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో 502/1, 2.05 సెంట్లు, పైకి 1.02 సెంట్లు, 502/3 0.99 సెంట్లు పైకి 0.49 సెంట్లు వికలాంగుల భూమిని రెవిన్యూ ఆధికారులు సర్వే చేస్తుండగా భూ కబ్జాధారులు అడ్డుకొంటున్నారని బాధితుడు ముప్పాల వెంకట్రామ రాజు తెలిపారు.వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రాయచోటి నియూజక వర్గం లోని లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలోని రాయచోటి వేంపల్లి రహదారి కూడలిలో మార్చి 21 వ తేదీన వికలాంగులు ధర్నా చేసిన రోజు అధికారులు ఇచ్చిన హామీ మేరకు సంబంధిత సర్వే నెంబర్ల లో వున్న వారందరికీ రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి సమస్యను పరిష్కరిస్తామని తెలిపిన మేరకు 11 ఏప్రిల్ 2023 ఉదయం 10 గంటలకు తమ తమ భూమి రికార్డులు తీసుకొని రమ్మని నోటీసు లో తెలిపిన రికార్డు ఏ మాత్రం తీసుకొని రాక పోగా మండల సర్వేయరు,మండల రెవె న్యూ ఇన్స్పెక్టర్,గ్రామ రెవెన్యూ అధికారులు ఖబ్జాదారులకే వత్తాసు పలుకుతూ దివ్యాంగుని భూమి విషయములో అన్యాయం చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.. దశాబ్దాల తరబడి వారసత్వంగా స్థానిక పాత కోర్టు దగ్గర వున్న ముప్పాల వెంకట రామ రాజు తండ్రి వెంగమరాజు అనే దివ్యాంగుని భూమి RSR రికార్డు నుండి ఇప్పటి వరకు 1B , అడంగల్ లో వుండి ఆన్లైన్ లో కలదు. తన పూర్వీకులు గానీ తను గానీ విక్రయించలేదని, అయితే సంభదిత దర్బార్ ,షరీఫ్,బాబ్జాన్ మరికొంత మంది వ్యక్తులు వచ్చి దివ్యంగుడు చదును చేసుకుంటున్నా భూమి ని అడ్డుకున్నారు. సంబంధిత అధికారులు రికార్డును పరిశీలించి న్యాయం చేయలేని పక్షంలో 15 రోజుల లోపు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడతామని రాష్ట్ర PWDF సహాయ కార్యదర్శి M.V.రామరాజు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఇప్పటికైనా ఉన్నంతాధికారులు తమ రికార్డులు పరిశీలించి తమకు న్యాయం చేయనిపక్షంలో తాము రాష్ట్ర వ్యాప్త వికలాంగులతో ధర్నాలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ నిరుద్యోగ వికలాంగుల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ,PWDF రాష్ట్ర కార్యదర్శి, కొణతం చంద్రశేఖర్, PWDF రాష్ట్ర అధికార ప్రతినిధి సుబ్రమణ్యం, అన్నమయ్య జిల్లా PWDF జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు జిల్లా PWDF కార్యదర్శి గోవర్ధన్, మోహన్, వెంకట్రామిరెడ్డి,గంగయ్య నాయకులు, జ్యోతి బాబు పాకాల మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

About Author