కర్నూలులో లెదర్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయండి
1 min read– నల్లా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేదార్ నాథ్
పల్లెవెలుగు వెబ్: చిరువ్యాపారుల కోసం కర్నూలులో లెదర్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని నల్లా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేదార్ నాథ్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం కర్నూలు పున్నమి గెస్ట్‌హౌస్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కాకుమాను రాజశేఖర్‌ను మాదారపు కేదార్నాథ్ మర్యాదపూర్వకగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి, శాలువ కప్పి సత్కరించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి లీడ్ క్యాప్ చైర్మెన్ గా రాజశేఖర్ ను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా కేదార్ నాధ్ మాట్లాడారు. కర్నూలు పట్టణంలోని బుధవార పేట అతిపెద్ద దళిత వాడని, నిరక్షరాస్యత కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం అని చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవార పేటలో లెదర్ ఇండస్ట్రీస్ చిరు వ్యాపారులకు పెట్టించాలని కోరారు. చర్మకారులకు ఉపాధి అవకాశం కల్పించి వారి అభివృద్ధికి కృషి చేయాలనీ ఈ సందర్బంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో జస్వంత్, వసంత్, అమృత్, ఆంజనేయులు యాదవ్, నాయకులు ప్రసాద్,రాజేష్, లక్ష్మణ్,నవీన్,ఖాసిం వలి, జమ్మన్న,ఏసన్న,ప్రభుదాస్, చందు,రవి,గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.