PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోలోగా అయినా.. తగ్గేదే లే..పుష్ప రిలీజ్‌

1 min read

సినిమా డెస్క్​ : సంక్రాంతి బరిలో మహేష్, ప్రభాస్ సినిమాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కూడా సంక్రాంతికే అన్నారు. తాజాగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్టు, మ్యూజిక్ సిట్టింగ్స్ వీడియోని రిలీజ్ చేసిన టీమ్, రిలీజ్ డేట్ ని కూడా రివీల్ చేశారు. ఇలా ముగ్గురు స్టార్స్ సక్రాంతి బరిలో సై అంటుంటే, అల్లు అర్జున్ మాత్రం సోలోగా బరిలోకి దిగుతున్నాడు. బన్నీ హీరోగా సుకుమార్ తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు నిన్న అనౌన్స్ చేశారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 13న ఫస్ట్ సింగిల్ రిలీజ్ తో ప్రమోషనల్ సందడి కూడా స్టార్ట్ చేస్తున్నారు.

About Author