PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి – ఎంపీడీఓ

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: స్థానిక ఎంఈఓ కార్యాలయంలో గురువారం నాడు  జి ఈ ఆర్  సర్వేపై విద్యా సంక్షేమ సహాయకులతో జరిగిన వర్క్ షాపు నందు, ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప మాట్లాడుతూ, గడివేముల మండలంలోని బడి ఈడు పిల్లలందరూ, పాఠశాలలో ఉండే విధంగా చూడాలని, ఇది మీ బాధ్యతగా భావించి, పిల్లలందరి నీ పాఠశాలలో నమోదు చేయాలని, విద్యా సంక్షేమ సహాయకులను సూచించారు. సర్వేలో ఎవరైనా పిల్లలను బడి బయట గుర్తిస్తే వారిని వెంటనే పాఠశాలలో నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఈఓ *విమలా వసంతరా దేవి* మాట్లాడుతూ, మండలంలోని 228 మంది వాలంటీర్లకు గాను 220 వాలంటీర్లు సర్వే పూర్తి చేశారని, మిగిలిన వాలంటీర్లు అందరితో సర్వే పూర్తి చేయించాలని సూచించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువును మధ్యలో మానేసి తిరిగి చదువు కొనసాగించాలని కోరుకునే వారు, ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుటకు అవకాశం ఉందని, అలా ఎవరైనా విద్యార్థులు గుర్తిస్తే వారిని వెంటనే ఓపెన్ స్కూల్ నందు నమోదు చేయించాలని, సంబంధిత అప్లికేషన్ ఫారాలను విద్యాసంక్షేమ సహాయకులు అందజేశారు.

About Author