ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక అందాలి
1 min read– రాష్ట్ర పరిశీలనాధికారి శ్రీనివాసరావు
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక అందజేయాలని, అందుకోసం మండల టీం సన్నద్ధంగా ఉండాలని. బుధవారం నాడు, జగనన్న విద్యా కానుక స్టాక్ పాయింట్ పరిశీలనకు వచ్చిన రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాసరావు గారు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాక్ పాయింట్ ను ఏర్పాటుకు తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల టీంకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. స్టాక్ పాయింట్ నందు తరగతి గదులు కారకుండా ఉండాలని, బండ పరుపు కుంగకుండా ఉండాలని, సెక్యూరిటీ ఉండే విధంగా చూడాలని ఎంఈఓ రామకృష్ణ మరియు ఏపీఎం యం. హెచ్.ఓ హజరత్ లను సూచించారు. రాష్ట్ర పరిశీలకుల వెంట జిల్లా అధికారి లలిత కుమారి మరియు అసిస్టెంట్ ఏ ఎం ఓ ఉర్దూ యూనిస్ బాషా సార్ గారు మండల టీంతో పలు విషయాలు చర్చించారు.కార్యక్రమంలో ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ హిదాయతుల్లా, కంప్యూటర్ ఆపరేటర్ విజయ్ కుమార్, ఐఇఆర్టీలు పకీర్ సాహెబ్, ఆంజనేయులు, సి ఆర్ పి లు రాజేష్, నాగరాజు పాల్గొన్నారు.