PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి

1 min read

– జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు”జాతీయ నులి పురుగుల నిర్ములన దినోత్సవం”పై సంబంధిత అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….ఈనెల 14 వ తేదీన “జాతీయ నులి పురుగుల నిర్ములన దినోత్సవం” నిర్వహించడం జరుగుతుందన్నారు.అన్నమయ్య జిల్లాలో 1సం నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలు 382804 మంది ఉన్నారన్నారు. వీరందరికీ ఈనెల 14వ తేదీన అల్బెన్దజోల్ 400మీ.గ్రా మాత్రలు తప్పకుండా మింగించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఢీ వార్మింగ్ డే ను ఈనెల 14వ తేదీన నిర్వహించడం జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ ,నర్సింగ్ జూనియర్ కళాశాలలలో ఉన్న 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు అల్బెన్దజోల్ 400మీ.గ్రా మాత్రలు మధ్యాహ్నం భోజనం అనంతరం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. డ్రాపౌట్స్ మరియు 14వ తేదీన మాత్రలు తీసుకోని వారి కొరకు ప్రత్యేకంగా 18 వ తేదీన మాప్ అప్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కొరకు ,రక్తహీనత లేని సమాజ స్థాపనకు ప్రతీ సంవత్సరం రెండు దఫాలు డీ వార్మింగ్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా అల్బెన్దజోల్ 400 మీ.గ్రా మాత్రలు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో 1 నుండి 19 సం లోపు పిల్లలు అందరికీ ఉచితంగానే అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ,అంగన్వాడీ కేంద్రాలలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులలో రక్తహీనత నివారణ చర్యలు చేపట్టడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు,మానసిక, శారీరక పెరుగుదల ఉంటుందన్నారు. ముఖ్యంగా కిశోర బాలికలకు ఐరెన్ అత్యంత అవసరమని అందుకే “రక్తహీనత రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.భవిష్యత్ తరాల పిల్లల ఆరోగ్యం కోసం నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమంలో అందరూ భాగ్యస్వాములై విజయవంతం చేయాలని, చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మనందరి బాధ్యత అన్నారు. ఉపాధ్యాయులు ఈ మాత్రలను మధ్యాహ్న భోజన అనంతరం ఉపాధ్యాయుల సమక్షంలో పిల్లల చేత చప్పరించి మింగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న 1-2 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ అర్ధ మాత్రను 3-5 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ ఒక మాత్రను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలాలలో ఎంపీడీవోలు, మండల విద్యాశాఖ అధికారులు మెడికల్ ఆఫీసర్లు, ఆశ వర్కర్లు,  ఏఎన్ఎంయూలు, అందరూ అధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మన అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు. అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండయ్య,డి.సి.హెచ్.ఎస్.డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమ అధికారి డాక్టర్ శేషగిరి బాబు, ఎన్.డి.డి.కార్యక్రమ జిల్లా సమన్వయ కర్త ఇంతియాజ్, బి.సి.వెల్ఫేర్ హాస్టల్ డిప్యూటీ డైరెక్టర్ ,సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డిడి జాకీర్ హుస్సేన్, జిల్లా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, , హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ,,తదితరులు పాల్గొన్నారు.

About Author