NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రాలయం పరిశుభ్రత కు ప్రతి ఒక్కరూ సహకరించాలి

1 min read

పల్లెవెలుగు ,మంత్రాలయం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం పరిశుభ్రత కు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య కోరారు.  శనివారం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి , రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు మంత్రాలయం గ్రామ పంచాయతీ పరిధిలో ఈవో నాగరాజు  ఆధ్వర్యంలో చేపట్టిన చెత్త సేకరణ అవగాహన నిమిత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదోని డిఎల్ పీవో నూర్జహాన్  హాజరై పలు కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులందరూ మా ఊరులో చెత్త సేకరణ కేంద్రం ఉంది పంచాయతీ తరుపున ప్రతి రోజు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి ప్రభావతి, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్ స్వామి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేష్ శెట్టి, వెంకటేష్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *