ప్రతి ఒక్కరు దేశ సమైక్యతను పెంపొందించుకోవాలి-ఎంపీపీ చీర్ల
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపుమేరకు మేరీ మట్టి-మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా అమృత కలశ యాత్ర కార్యక్రమం శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో చీర్ల సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షత వహించారు, ఈ సందర్భంగా ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రతి ఒక్క గ్రామపంచాయతీలో దేశభక్తి భావనతో శిలాఫలకాలు నిర్మించడం జరిగిందన్నారు, వీరులకు వందనం పేరుతో సైనికులను సన్మానించడం జరిగిందన్నారు. మండలం లోని 10 గ్రామపంచాయతీల నుండి సేకరించిన మట్టి అలాగే ధాన్యమును మండల కేంద్రంలో ఒకటిగా చేసి మూడు కలశాలలో నింపి, అనంతరం ముగ్గురు ప్రతినిధుల ద్వారా ఢిల్లీకి పంపడం జరుగుతుందన్నారు, ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవర్చుకోవడం, దేశ సమైక్యతను పెంపొందించుకోవడం, ఐక్యతగా ఉండటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఎంపిపి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జిఎన్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి. ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, నాయకులు ఎర్ర సాని మోహన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, సమరత సేవ మండల అధ్యక్షులు గురు ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.