NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్ స్టాప‌బుల్ లో చంద్ర‌బాబు చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్ధాలే !

1 min read

పల్లెవెలుగువెబ్: అన్‌స్టాప‌బుల్ ప్రోమోలో చంద్ర‌బాబు చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి శ్రీనివాస‌రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్‌ను సీఎం ప‌ద‌వి నుంచి దించి మాన‌సికంగా ఆయ‌న‌ను చంద్ర‌బాబు హ‌త్య చేశార‌ని ఆరోపించారు. త‌న తండ్రికి ద్రోహం చేసిన వ్య‌క్తిని బాల‌కృష్ణ ఇంట‌ర్వ్యూకి ఎలా పిలిచార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నాడు టీడీపీని చంద్ర‌బాబు లాగేసుకున్న స‌మ‌యంలో త‌న‌తో పాటు 14 మంది ఎమ్మెల్యేలం ఎన్టీఆర్‌తోనే ఉన్నామ‌ని చెప్పారు. ఎన్టీఆర్ చ‌నిపోయే దాకా కూడా తాము 14 మందిమీ ఆయ‌న‌తోనే ఉన్నామ‌న్నారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు, రామోజీరావుల‌కు అమ్ముడుబోయార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు కాళ్లు ప‌ట్టుకునే ర‌కం కాద‌ని… కాళ్లు ప‌ట్టుకు లాగే ర‌క‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

                         

About Author