PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి హామీ పనుల పరిశీలన : పిడి రామచంద్ర రెడ్డి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ గడివేముల: ఉపాధి హామీ పథకంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్. సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్. మామిడి తోటల. పెంపకం. పనులను శుక్రవారం నాడు నంద్యాల జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి పరిశీలించారు కొరటమద్ది గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించి మొక్కలకు సరైన సమయంలో నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించి సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేసి రైతులకు అందించడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు దుర్వేసి గ్రామంలో రైతులకు అందించిన మామిడి మొక్కల పెంపకం పై వివరాలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు ప్రతి పని వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకాలను పరిశీలించి ఉపాధి హామీ సిబ్బందిని అభినందించారు అనంతరం దుర్గ భోగేశ్వర ఆలయంలో సతి సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి హామీ సిబ్బంది వివిధ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కొరటమద్ది సర్పంచ్ నాగేశ్వర్ రెడ్డి. పంచాయతీ కార్యదర్శి సలీం. ఏపీవో వెంకటరమణ .ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

About Author