NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్సాహం.. ఉల్లాసం..

1 min read
ఆటల పోటీలను ప్రారంభిస్తున్న కలెక్టర్​ సతీమణి జి. ఆండాల్​

ఆటల పోటీలను ప్రారంభిస్తున్న కలెక్టర్​ సతీమణి జి. ఆండాల్​

– ఆటలపోటీలో ఉత్సాహం కనబరిచిన ఉద్యోగినులు
పల్లెవెలుగు, కర్నూలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శని, ఆదివారాలు రెండు రోజుల పాటు నిర్వహించిన ఆటల పోటీల్లో మహిళా ఉద్యోగినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియం ఇండోర్ స్టేడియంలో కలెక్టర్​ సతీమణి జి.ఆండాళ్, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ మరియు అభివృద్ధి) రామసుందర్ రెడ్డి సతీమణి ప్రసన్న, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ సతీమణి షహనాజ్, మున్సిపల్ కమిషనర్ డి. కె.బాలాజీ సతీమణి డీ.కె.పృద్వి కళ్యాణీ లతో కలిసి ఆటల పోటీలను ప్రారంభించారు. త్రో బాల్, షాట్ ఫుట్, షటిల్ సింగిల్స్‌, డబుల్స్‌, మ్యూజికల్‌ ఛైర్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, స్పీడ్ వాక్, లెమన్ స్పూన్, క్విజ్ తదితర పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టరేట్లోని మహిళా ఉద్యోగులు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్ తదితర పలు శాఖలలో విధులు నిర్వహిస్తున్న సుమారు 300 మందికి పైగా మహిళా ఉద్యోగులు ఆటల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారని ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ వివరించారు. విజేతలకు కలెక్టర్​ జి. వీరపాండియన్​ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారని ఆమె వెల్లడించారు.

About Author