PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయండి

1 min read

– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య.

పల్లెవెలుగు వెబ్  కర్నూలు  : జిల్లాలో జరిగే భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి భూముల రీ సర్వే, జగనన్నకు చెబుదాం, కౌలు రైతుల గురించి, భూ సేకరణ వివిధ ప్రభుత్వ పథకాల అమలు పై అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రీ సర్వేలో జరుగుతున్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి గ్రౌండ్ ట్రూతింగ్ , గ్రౌండ్ వాలుయేషన్ అయిన తర్వాత తహసిల్దారులు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే వాటిని పంపవలసిందిగా ఆదేశించారు. పెద్దకడబూరు మండలంలో గ్రౌండ్ ట్రుతింగ్ మరియు ఎల్ .పి జనరేషన్ ని త్వరగా పూర్తి చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పెద్దకడబూరు తహసిల్దార్ ను ఆదేశించారు. గోనెగండ్ల మండలంలో ఎన్ని రోవర్స్ ఉన్నాయి,  ఒక రోవర్ ను ఒక రోజుకి 100 ఎకరాలకు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని  గోనెగండ్ల తహసీల్దార్ ను ఆదేశించారు. మండలంలో నాలుగు రోజుల లోపల పనులు పూర్తి చేయాలని సంబంధిత తహసిల్దార్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఖాతా మాస్టర్ అప్లోడ్ లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ తహాసిల్దార్ ద్వారా లాగిన్ అయ్యి అడ్రస్, పేరు, ఫోటో, కులము మొదలగు వివరాలు అన్నియు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకుని అప్లోడ్ చేయవలసిందిగా  జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు.భూ సేకరణ విషయంలో బఫర్ గొడౌన్స్ నిర్మాణం కొరకు ప్రభుత్వ భూముల సేకరణకు కృషి చేయాలని కర్నూల్ ఆర్డీవోను కల్లూరు తహసిల్దార్ లను ఆదేశించారు.రైల్వే వారికి పెద్దకడుబూరు , గవిగట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఎల్లినేషన్ చేయించి నివేదిక త్వరగా పంపాలని తహసిల్దార్ లను ఆదేశించారు.ఎలక్షన్ బూత్ లెవెల్ అధికారులు ఇంటి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా తెలుసుకోవాలని ఒకే ఇంటిలో 10 ఓట్లు ఉన్న వాటిని , వయసు 99 పైన ఉన్న వారి వివరాలు , జంక్ క్యారెక్టర్స్ మరియు ట్రాన్స్ జెండర్స్ వారి వివరాలు సక్రమంగా సేకరించి  ఓటర్ల లిస్టు స్వచ్చీకరణకు కృషి చేయాలని ఇంటింటి సర్వేకు సంబంధించిన సర్వే మందకోడిగా సాగుతున్నదని అలా కాకుండా వేగమంతమయ్యేలా చూడాలని, ఓటర్ల నమోదుకు సంబంధించి ప్రజలకు అవగాహన కలిగేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని మండల స్థాయి అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.కౌలు రైతులకు అవసరమైన సిసిఆర్సి కార్డులను  అర్హులైన కౌలు రైతులకు అందజేయాలన్నారు. అందుకు ప్రతి ఒక్క రైతును వెరిఫై చేసి వారికి అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సిసిఆర్సి కార్డులను గురించి, కౌలు రైతుకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను గురించి, క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కలిగించి అర్హులైన కౌలు రైతుల అందరికీ సిసిఆర్సి కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.జగనన్నకు చెబుదాంకు సంబంధించి వచ్చిన అర్జీలకు సరైన రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వడంతో పాటు  వాటిని నాణ్యతతోపరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ శాతం భూముల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, స్మశాన వాటిక లకు స్థలాలు కావాలని, భూములు ఆక్రమించుకున్నారని చిన్న చిన్న సమస్యలు కూడ జిల్లా స్థాయికి పరిష్కారం కొరకు వస్తున్నారు. అలా కాకుండా మండల స్థాయిలో పరిష్కారము కావలసిన సమస్యలను అక్కడనే పరిష్కరించాలని మండల స్థాయి అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగేశ్వరరావు, జిల్లాస్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

About Author