NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి జొన్నగిరి పర్యటన ఏర్పాట్లను విస్తృతంగా పరిశీలన

1 min read

పరిశీలించిన కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ

జోనల్-5 కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ బాబు, పత్తికొండ పరిశీలకులు పోలన్న గారు, మరియు అధికారులు

కర్నూలు, న్యూస నేడు:  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఈనెల 24న జొన్నగిరిలో నిర్వహించనున్న పర్యటన, బహిరంగ సభను ఘనవిజయవంతం చేసేందుకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ  విస్తృతంగా ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతం, వేదిక నిర్మాణం, ప్రజల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రతా చర్యలు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు, పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జొన్నగిరిలో భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆమె సూచించారు. సభా ప్రాంగణంలో క్రమశిక్షణతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని, జొన్నగిరి పర్యటన రాయలసీమ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని అన్నారు. జియో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి పర్యటనను చారిత్రాత్మక విజయంగా నిలిపేందుకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక పురోగతికి జొన్నగిరి పర్యటన ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొని ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రేపు జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ  స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *