ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాలతో విస్తృత వాహన తనిఖీలు
1 min read

మైనర్లకు వారి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదు
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా ఎస్పీ కే ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలపై విస్తృత వాహన తనిఖీలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు మరియు సిబ్బందితో గురువారం ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద వాహన తనిఖీలను నిర్వహించినారు.ఈ వాహన తనిఖీల్లో భాగముగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నటువంటి విషయాన్ని గమనించి వారికి ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తూ జరిమానా విధించడం కాకుండా వారిలో చైతన్యం నింపేందుకు ఏదైనా ప్రమాదం జరిగితే జరిగే అనర్ధాలను గురించి వారికి వివరించి అవగాహనను కల్పించినారు. ఈ సందర్భంగా ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని అలా ఇచ్చిన ఎడల మైనర్లపై కేసు పెట్టడమే కాకుండా తల్లిదండ్రులు పై కూడా చర్యలు తీసుకొని బడతాయని మరియు ఎవరైనా మైనర్లు పై కేసులు నమోదు చేస్తే వారికి 25 సంవత్సరాలు వయసు వచ్చేంతవరకు వారికి డ్రైవింగ్ లైసెన్సు రాదని, ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వలన ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో అది ప్రాణాపాయ స్థితి నుంచి మిమ్మల్ని కాపాడగలుగుతుందని ప్రతి ఒక్కరు గమనించాలని, మద్యం సేవించి వాహనం నడిపితే వాహనం నడిపే వ్యక్తికే కాకుండా ఎదుటి వ్యక్తి కూడా ఆపాయాలు జరిగేటటువంటి ఆస్కారాలు ఉన్నాయని మద్యం సేవించి వాహనాలు నడిపితే సుమారు పదివేల వరకు జరిమానా విధించబడుతుందని లేదా జైలు శిక్ష కూడా విధించవచ్చునని ఈ సందర్భంగా వాహనదారులకు తెలియ చేసినారు.

