7వ రోజు సుపరిపాలనలో “తొలి అడుగు” కార్యక్రమంలో ఎమ్మెల్యే
1 min read

కుటమి ప్రభుత్వంలో అభివృద్ధి,సంక్షేమం కార్యక్రమాల కరపత్రాలు పంపిణీ
ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 14వ రోజు ఏడవ డివిజన్ లో పాండురంగ థియేటర్ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ హాజరయ్యారు. డివిజన్ ప్రజలు నాయకులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. సంవత్సరకాలం నుంచి జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి బడేటి రాధాకృష్ణ ప్రజలకు వివరిస్తూ కరపత్రం అందజేశారు. ప్రజలు చెప్పిన పలు సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బడే రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరకాలం పరిపాలనలో ఇప్పటివరకు తిరిగిన అన్ని డివిజన్లో ఈ డివిజన్ ప్రజలు 98 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఏదైతే చెప్పిన డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో వాటిని త్వరితగతిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా వికలాంగురాలకు నాలుగు సంవత్సరాల నుంచి టెన్షన్ రావట్లేదు అన్నారో ఆవిడకు వెంటనే పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి , నగర టౌన్ ప్రెసిడెంట్ చౌడే వెంకటరత్నం, మాజీ ఇడా చైర్మన్ బోద్దని శ్రీనివాస్, ఏడో డివిజన్ ఇంచార్జ్ రాజా మురళీకృష్ణ, కో- ఆప్షన్ సభ్యులు ఎస్ఎం ఆర్ పెద్దబాబు, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


