ముఖ చిత్ర హాజరు రద్దు చేయాలి
1 min read– జీవో నంబర్ 1ని రద్దు చేయాలి
– రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు వినతి పత్రం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మున్సిపల్ కార్మికులకు చెంపపెట్టుగా ఉన్న ఫేస్ హాజరు రద్దుచేసి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ ఒకటి రద్దు చేయాలని కోరుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రఘు రామ మూర్తి కార్యదర్సి రమేష్ బాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అనేకమంది కార్మికులకు కనీసం సెల్ఫోన్లో లేని పరిస్థితి ఉన్నదని అలాంటివారు ఫేస్ యాప్ ఎలా వేయించుకుంటారని చాలామంది చదువు లేని వారు ఉన్నారని, ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల వారి ఉద్యోగానికి భద్రత ఉప్పు వాటిల్లుతుందని వారన్నారు. సమ్మె కాలంలో ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇంతవరకు అమలు చేయలేదన్నారు.. కార్మికులకు ఇచ్చిన హామీలను మరిచిన ముఖ్యమంత్రి గారు వారిపై బారాలు మోపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం పద్ధతి కాదన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ ఒకటిని తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలు అణచివేయాలని చూడడం తగదని, బ్రిటిష్ కాలం నాటి నుండి ఈ రాష్ట్రంలో దేశంలో పోరాటాలు జరుగుతున్నాయని అలాంటి వాటిని అడ్డుకునే శక్తి ఏ ఒక్కరికి లేదని వారన్నారు. తక్షణమే జీవనం ఒకటిని రద్దు చేయాలని వారి డిమాండ్ చేశారు.ఈ సమస్య లను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ గారికి రాజ్యాంగ పరిరక్షణ దినం సందర్బంగా కోరుతూ వినతి పత్రం సమర్పించామని ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. యూనియన్ నాయకులు శ్రీనివాసులు రాజు, తిరుపతయ్య, దానమయ్య, తదితరులు పాల్గొన్నారు.