PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రుల పై దాడులంటూ తప్పుడు ప్రచారం !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ మంత్రులపై జనసేన శ్రేణులు దాడి చేసే అవకాశాలున్నాయంటూ దుష్పచారం జరుగుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో జనసేనపై మరో కుట్రకు తెరదీశారని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలు ఎవరు చేస్తున్నారో తమకు తెలుసని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జనసేనకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఈ కుట్రపై డీజీపీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ కుట్రలను జనసైనికులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

About Author