NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ల‌వాలన్న అభిమాని.. ఫ్లైట్ బుక్ చేసి పిలిపించుకున్న మెగాస్టార్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మెగాస్టార్ చిరంజీవి త‌న అభిమానుల ప‌ట్ల అవ్యాజ‌మైన ప్రేమ‌ను చూపిస్తారు. ఇందుకు నిద‌ర్శన‌మే ఈ ఘ‌ట‌న‌. విశాఖ‌ప‌ట్నానికి చెందిన వెంక‌ట్ గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. చిరంజీవిని క‌ల‌వాల‌ని, కానీ క‌ద‌ల‌లేకున్నాన‌ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన చిరంజీవి వెంక‌ట్ ను ఫ్లైట్ బుక్ చేసి మ‌రీ హైద‌రాబాద్ పిలిపించుకున్నారు. అత‌ని ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. హైద‌రాబాద్ లోని ఓ ఆస్పత్రికి వెళ్లాల‌ని సూచించారు. చెన్నైలో కూడ అవ‌స‌ర‌మైతే వైద్యం అందించే విధంగా చేస్తాన‌ని తెలిపారు. ఖ‌ర్చులు తాను భ‌రిస్తాన‌ని హామి ఇచ్చారు. చిరంజీవి త‌న అభిమాని ప‌ట్ల చూపించిన ప్రేమ‌కు ప‌లువురు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

About Author