NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో నిరసన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: రాష్ట్ర ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు నేడు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఆధర్వ్యంలో  ఉపాధ్యాయులు భారీగా కలెక్టరేట్ ఎదుట హాజరు అయి నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలియ చేశారు.ఈ కార్యక్రమం యందు రాష్ట్ర ఫ్యాప్టో కో ఛైర్మన్ మరియు కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇంచార్జి కాకి ప్రకాష్ రావు హాజరు కావడం జరిగింది. ఆయన పి అర్ సి కమిటీ వేసి, వెంటనే 30 శాతం ఐ అర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ సేవా లాల్ నాయక్(ఆప్టా) అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమంలో యు టి ఎఫ్ రాష్ట్ర నాయకులు సురేష్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వం అధికారం లో వచ్చిన వెంటన్ ఉపాధ్యాయ మరియు ఉద్యోగులు యొక్క అన్ని బకాయిలు తీరుస్తాం అని చెప్పి కొద్ది మొత్తం మాత్రమే వేశారు మిగిలిన వాటికి కనీసం రోడ్ మ్యాప్ కూడా ప్రకటించటం లేదు అని చెప్పారు. ఎ పి టి ఎఫ్ 257 రాష్ట్ర నాయకులు రవి కుమార్ గారు మాట్లాడుతూ సి పి ఎస్ రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. జిల్లా ఫాఫ్టో చైర్మన్ సేవా లాల్ నాయక్ నాయక్ గారు కారుణ్య నియామకాలు చేపట్టాలని, చనిపోయిన ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి వారిని వెంటనే ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. ఎస్ టి యు జిల్లా అధ్యక్షుడు గోకారి గారు ఆంగ్ల మాధ్యమం కు సమాంతరంగా తెలుగు ను కూడా కొనసాగించాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఎ పి టి ఎఫ్ 1938 నాయకులు ఇస్మాయిల్ మాట్లాడుతూ 2022 నుండి సరెండర్ లీవ్ లు బకాయిలు ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలి అని కోరటం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం లో జిల్లా  సెక్రెటరీ జనరల్ భాస్కర్ (బి టి ఎ),రవి కుమార్ (యు టి ఎఫ్), నవీన్ పాటిల్ (యు టి ఎఫ్), ఎల్లప్ప (యు టి ఎఫ్), జనార్దన్ (ఎస్ టి యు), ప్రసన్న రాజు (ఎస్ టి యు),మరియానందం(ఎ పి టి ఎఫ్1938), రామకృష్ణ (ఎ పి టి ఎఫ్ 1938), రంగన్న ఫ్యాప్టో జిల్లా కోశాధికారి (ఎ పి టి ఎఫ్ 257) నాగరాజు (ఎ పి టి ఎఫ్ 257),రాజసాగర్ (అప్టా), రఫీ (ఆప్టా), మధుసూధన్ రెడ్డి (అప్టా), కరి కృష్ణ (డి టి ఎఫ్), తిమ్మప్ప ( డి టి ఎఫ్), వెంకట్రాముడు (డి టి ఎఫ్), లక్ష్మయ్య (పి ఇ టి అసోసియేషన్) మొయిన్ (రుటా),గులాబ్ భాష (రుటా) , మాదన్న (బి టి ఎ), రాము (బి టి ఎ)మరియు జిల్లా నలుమూలల నుండి ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *