NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతు ఆవేదన… ఏళ్ల తరబడి నష్టపరిహారం అందడం లేదు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని బిలకల గూడూరు గ్రామ సమీపాన2008వ సంవత్సరంలో జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంలో బిలకల గూడూర్ గ్రామనికి చెందిన రైతు బాలస్వామి కి చెందిన ఐదు ఎకరాల పొలాన్ని జిందాల్ ఫ్యాక్టరీ నిర్మాణం లో భూమి పోవడంతో రైతు బాలస్వామికి నష్ట పరిహారం ఇవ్వకుండా జిందాల్ ఫ్యాక్టరీ వారు ఇబ్బందులు గురి చేస్తున్నారని బుధవారం నాడు జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సామన్ ఎదుట రైతు బాలస్వామి తన ఆవేదన వ్యక్తం చేశారు తెలియజేశారు. తమకు ఐదు ఎకరాల పొలంలో కేవలం ఎకరా 20 సెంట్లపొలానికి నష్ట పరిహారం అందించారని మిగతా మూడు ఎకరాల 80 సెంట్లు పొలానికి నష్ట పరిహారం ఇవ్వకుండా15 సంవత్సరాల నుండి నాకు ఇబ్బందులు గురి చేస్తున్నారని రైతు బాలస్వామి కలెక్టర్ మాట్లాడుతూ విచారణ చేసి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

About Author